రైతుల కోసంప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కోత , కేసీఆర్ కి ఆంధ్రా ఫిదా అయిపోయింది..!

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆంధ్రప్రదేశ్ రైతులు ఫిదా అయిపోయారు. తెలంగాణ లో పండిన ప్రత్తి పంటను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని లేదని, గ్రామాలకు వచ్చే అధికారులు టోకెన్లు ఇచ్చి కొనుగోలు చేస్తారని కెసిఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పౌరసరఫరాల శాఖకు 25 వేల కోట్ల రూపాయలను కేటాయించామని కెసిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రైతులకు చేసింది అంటున్నారు. తెలంగాణలో పండే పంటలు కూడా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయవద్దని ఇక్కడి పంటలు ఇక్కడి వాళ్లకు అవసరం ఉంటాయని. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తుల కొరత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా ఎగుమతులు చేయవద్దని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ విషయంలో కాస్త వెనుకబడి ఉన్నారని చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్లో  పశ్చిమ గోదావరి, కడప, కర్నూలు అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పంటలు ఎక్కువగా పండుతాయి.వరి మొక్కజొన్న వంటి పంటలను ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగుమతి చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఆహార కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఆందోళన అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని కేసీఆర్ ముందుగానే ఆలోచించి ఎగుమతి చేయవద్దు అని సూచనలు చేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టే కెసిఆర్ కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని, కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ముందుకు రాలేదని, దీని కారణంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు భారీగా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు న్యాయం చేయడానికి అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా తగ్గిస్తానని కేసీఆర్ చేసిన ప్రకటనకు ఆంధ్రప్రదేశ్ ఫిదా అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news