రైతు ఆత్మగౌరవం కాపాడేలా కలిసి పనిచేద్దాం : సీఎం కేసీఆర్‌

-

ప్రగతి భవన్‌లో నేడు రెండో రోజు సీఎం కేసీఆర్‌ రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి రంగం, గిట్టుబాటు ధరలు తదితర అంశాలపై చర్చించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం ఎలా ఉంది? బీజేపీయేతర రాష్ట్రాల్లో రైతుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే అంశాలను కూడా సమీక్షించారు. కాగా, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో, గ్రామస్థాయి నుంచే రైతులు ఏకం కావాలని నేతలు తీర్మానించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఓ భరోసా అందించేలా కార్యాచరణ ఉండాలని అభిలషించారు. రైతులు నష్టపోయేలా ఉన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని నిర్ణయించారు. రైతు వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం చేద్దామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ నిర్ణయాల్లో భాగంగా రైతులు నష్టపోయే చర్యలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

CM KCR in Delhi to pursue paddy issue

ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించాలని, అప్పుడే దేశ వ్యవసాయ, రైతాంగ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రైతు ఆత్మగౌరవం కాపాడేలా కలిసి పనిచేద్దామని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి అనుసరించడం ద్వారానే గమ్యాన్ని చేరకోగలమని వివరించారు. తెలంగాణ వ్యతిరేకులతో నాడు జై తెలంగాణ అనిపించినట్టే, నేడు రైతు వ్యతిరేకులతో జై కిసాన్ నినాదాన్ని పలికించాలని అన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటనగా ఏర్పడి ప్రతినబూనాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news