ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండే – సీఎం కేసీఆర్

-

ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాల్సింది గులాబీ జెండేనని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశ పరివర్తన కోసం బీఆర్ఎస్.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో వచ్చేది రైతు సర్కారేనని తేల్చి చెప్పారు. ఢిల్లీలో బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీస్‌ ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్‌గా మారింది టీఆర్ఎస్‌ పార్టీ.

లాంఛనంగా బీఆర్ఎస్‌ను ప్రారంభించిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ స్థానంలో భారత దేశం మ్యాప్‌, గులాబీ జెండా మధ్యలో భారత్‌ మ్యాప్‌ తో జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్‌. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్ఎస్‌ పార్టీ ఆఫీస్‌ ప్రారంభం చేస్తామని ప్రకటన చేశారు. రాబోయేది రైతు ప్రభుత్వమే.. కర్ణాటకలో జేడీఎస్‌కు బీఆర్ఎస్‌ మద్దతు, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తామన్నారు కేసీఆర్. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తాం.. రైతు పాలసీ, జల విధానం రూపొందిస్తామని వెల్లడించారు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news