తెలంగాణలో జంపింగ్ ఎమ్మెల్యేల వల్ల అధికార టీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వారు పార్టీలోకి రావడంతో తమ భవిష్యత్‌పై అనుమానాలు పెరిగాయి. నెక్స్ట్ మళ్ళీ సీటు వస్తుందా? రాదా? అనే డౌట్ వచ్చింది.
అయితే కొందరు నేతలు మళ్ళీ టిక్కెట్ దక్కించుకోవడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం మళ్ళీ మహేశ్వరం టిక్కెట్ దక్కించుకోవడానికి చూస్తున్నారు. గత ఎన్నికల్లో తీగల, సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి మంత్రిగా పదవి కూడా చేపట్టారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో మహేశ్వరం టిక్కెట్ సబితాకే దక్కేలా ఉంది. దీంతో తీగల పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు.
అసలు మొదట నుంచి తీగల మహేశ్వరంలోనే పోటీ చేస్తున్నారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2014లో టీడీపీ నుంచి గెలిచారు. కానీ తర్వాత టీడీపీని వదిలి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇక 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సబితా చేతిలో ఓడిపోయారు. ఇప్పుడేమో సబితా కూడా టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో ఆయన సీటు విషయంలో క్లారిటీ లేదు. మహేశ్వరం సబితాకు కేటాయిస్తే..తీగలకు మరొక సీటు ఇస్తారా? లేక ఏదైనా పదవి ఇస్తారా? అనేది తెలియడం లేదు.
అయితే తీగలపై కాంగ్రెస్, బీజేపీలు ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మహేశ్వరంలో ఆ రెండు పార్టీలకు సరైన నాయకులు లేరు. దీంతో తీగలని తీసుకొస్తే బెనిఫిట్ అవుతుందని ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయనని తమ పార్టీల్లోకి తీసుకోచ్చేందుకు చూస్తున్నాయి. చూడాలి మరి తీగల టీఆర్ఎస్‌లోనే ఉంటారో..లేక వేరే పార్టీలోకి జంప్ చేస్తారో?