దేశ రాజకీయాలను గురించి చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చాను. దేశంలో రాజకీయ మార్పులు, రాజకీయ పరిణామాల పై.. భవిష్యత్ కార్యచరణపై చర్చించామని తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశ అభివ్రుద్ధి, వికాసం, పాలసీల గురించి చర్చించామని కేసీఆర్ అన్నారు. మా మీటింగ్ తో ఇవాళ తొలి అడుగు పడిందని కేసీఆర్ అన్నారు. త్వరలోనే అందరు నేతలం హైదరాబాద్ లో కలుస్తామని ఆయన అన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలని కోరకున్నామని ఆయన అన్నారు. అందుకు కలిసి వచ్చేవారిని కలుపుకుపోతామని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మహారాష్ట్ర సహకారంతో పూర్తయిందని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ ముఖచిత్రం మారిందని కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాల పరస్పర సహకారం గురించి చర్చించామన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమనే అభిప్రాయాన్ని వెల్లడించారు కేసీఆర్. మహారాష్ట్ర, తెలంగాణ సోదర రాష్ట్రాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.