తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు ఇక కలిసి పనిచేస్తాయి – ఉద్దవ్‌ థాక్రే

-

తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు ఇక కలిసి పనిచేస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ థాక్రే ప్రకటన చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలు సోదర రాష్ట్రాలేనని.. స్పష్టం చేశారు ఉద్దవ్‌ థాక్రే. రెండు రాష్ట్రాలు ఇక ముందు కలిసి పని చేయాల్సిన అవసరముందని తెలిపారు. చాలా అంశాలపై తాము ఒకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు థాక్రే. త్వరలో మరోసాని సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.

అటు దేశ రాజకీయాలను గురించి చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని… దేశంలో రాజకీయ మార్పులు, రాజకీయ పరిణామాల పై.. భవిష్యత్ కార్యచరణపై చర్చించామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

దేశ అభివ్రుద్ధి, వికాసం, పాలసీల గురించి చర్చించామని కేసీఆర్ అన్నారు. మా మీటింగ్ తో ఇవాళ తొలి అడుగు పడిందని కేసీఆర్ అన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలని కోరకున్నామని ఆయన అన్నారు. అందుకు కలిసి వచ్చేవారిని కలుపుకుపోతామని కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మహారాష్ట్ర సహకారంతో పూర్తయిందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news