ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. అనంతరం గంధంవారి గూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తాము మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇన్ని ఉద్యోగాలు దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదని.. ఇదో రికార్డు అని తెలిపారు. శాఖల వారిగా ఎన్ని ఉద్యోగాలిచ్చామో అసెంబ్లీలో రుజువు చేస్తామని.. కేసీఆర్ సవాల్ విసిరారు. 

CM Revanth Reddy

ఉద్యోగాలపై బీఆర్ఎస్ చెప్పిందే బీజేపీ చెప్పిందన్నారు. ఇవాళ హైదరాబాద్ కి నడ్డా వచ్చారు. నేను అడుగుతున్నా.. నడ్డా, ప్రధాని మోడీని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 55వేల ఉద్యోగాలు ఇచ్చారని నిరూపిస్తే.. తాను ఢిల్లీలో క్షమాపణలు చెబుతానని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 55వేల ఉద్యోగాలు ఏడాది కాలంలో ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇచ్చిందని.. ప్రజా ప్రభుత్వం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version