సామాన్యులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన వంట గ్యాస్​ ధర

-

సామాన్యులకు అదిరిపోయే శుభవార్త అందింది. తాజాగా వంట గ్యాస్‌ ధరలను తగ్గించాయి చమురు సంస్థలు. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.36 తగ్గింది. ఈ తాజా తగ్గింపుతో, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 2012.50 కి బదులుగా రూ.1,976 అవుతుంది.

ఈ తగ్గింపు ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. అయితే.. కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర తగ్గింది కానీ.. గృహ వినియోగ దారులకు సంబంధించిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధర మాత్రం తగ్గలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.36 తగ్గిన తర్వాత ఒక్కో సిలిండర్ ధర రూ.1976.50గా మారింది. గతంలో దీని ధర సిలిండర్‌కు రూ. 2012.50గా ఉంది. ఇక కోల్‌కతాలో సిలిండర్‌కు రూ.2095.50గా మారింది. గతంలో దీని ధర సిలిండర్ రూ.2132 గా ఉంది. ముంబైలో సిలిండర్‌కు గతంలో రూ.1972.50గా ఉన్న సిలిండర్ రూ.1936.50గా మారింది. ఇక చెన్నైలో ఒక్కో సిలిండర్ రూ.2141గా మారింది. గతంలో దీని ధర సిలిండర్ రూ.2177.50 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news