వైద్య విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలంటూ ఆందోళన.. నిమ్స్ వద్ద ఉద్రిక్తత

-

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో డ్యూటీ సమయంలో సీనియర్ వైద్యుల వేధింపులు తట్టుకోలేక వైద్యురాలు, పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వేధింపులు భరించలేక ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా.. ప్రిన్సిపల్ సదరు సీనియర్ వైద్యులను మందలించినప్పటికీ, గట్టిగా మాట్లాడితే ఎక్కడ మార్కులు తగ్గిస్తారో అన్న ఆందోళనలో మనస్థాపానికి గురైన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు విద్యార్థిని ప్రీతికి న్యాయం చేయాలంటూ బిజెపి మహిళా మోర్చా నేతలు ఆందోళన చేపట్టారు. నిమ్స్ ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కాసేపట్లో గవర్నర్ తమిళిసై నిమ్స్ ఆసుపత్రికి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news