కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే : మంత్రి జగదీశ్ రెడ్డి

-

కాంగ్రెస్-బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసాను పక్కదారి పట్టించడానికే రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.15వేలు ఇస్తామని మాట తప్పారు. ఈ విషయాన్ని రైతుల్లోకి వెళ్లకుండా రేవంత్ ప్లాన్ చేశాడంటూ ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ ఆందోళనలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో కేటీఆర్ పై కేసులు పెడుతున్నారు.

కేటీఆర్ కేసులపై న్యాయ పోరాటం చేస్తామని.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టాన్ని రేవంత్ దుర్వినియోగం చేస్తున్నాడు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఏసీబీ.. బీజేపీ డైరెక్షన్ లో ఈడీ పని చేస్తోందని అంటూ జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా కారు రేస్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొక్క బోర్ల పడటం ఖాయమని తెలిపారు. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి లాయర్లను వెంట పెట్టుకొని వెళ్తారు. కేటీఆర్ లాయర్లతో ఏసీబీ విచారణకు వెల్లొద్దా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news