సమస్యలను ప్రశ్నించే వారిపై టీఆర్ఎస్ నేతలు పోలీసులతో కేసులు పెట్టి వేధింస్తున్నారని…. టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన విధంగా పోలీసులు నడుచుకుంటుడటంతో ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ వేధింపుల వల్లే కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో సాయి గణేష్ కూడా పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
పోలీసులు వారి విధులు నిర్వర్తించడం లేదని… టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లే నడుచుకుంటున్నారని విమర్శించారు. పోలీసులు బాధ్యతను టీఆర్ఎస్ నేతలు చేతిలోకి తీసుకుంటున్నారని విమర్శించారు. పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందని సామాన్యులు అనుకునేలా గత ప్రభుత్వాలు పనిచేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని బట్టి ఆరోపించారు. ప్రభుత్వాలేవి శాశ్వతం కావని… ఇదే విధంగా పోలీసులు ప్రవర్తిస్తే వచ్చే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు.