PCC తాజా పరిణామాలపై పార్టీ హైకమాండ్ ఆరా

-

పీసీసీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్‌ హైకమాండ్ ఆరా తీస్తోంది. నిన్న గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి నదీమ్‌ జావిద్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌కు నివేదించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేతలతో సమావేశం కావాలని.. ముగ్గురు కార్యదర్శులను రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్‌ ఆదేశించారు.

ఇప్పటికే ఏఐసీసీ కార్యదర్శి నదీమ్‌ జావిద్‌ హైదరాబాద్‌లో ఉండగా మిగిలిన ఇద్దరు బోసురాజు, రోహిత్‌ చౌదరిలు..ఇవాళ నగరానికి రానున్నారు. ఈ ముగ్గురు నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా అసంతప్త నేతలతో సమామావేశమయ్యే అవకాశం ఉంది. రేపు అసంతృప్తి నేతలు తిరిగి ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో సమావేశమై సేవ్‌ కాంగ్రెస్‌ నినాదంతో ముందుకెళ్తామని ప్రకటించిన తరుణంలో ఏఐసీసీ నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version