తెలంగాణ కాంగ్రెస్‌లో ట్విస్టు.. రేవంత్‌కు వ్య‌తిరేకంగా ఎమ్మెల్యేల లేఖ‌!

-

తెలంగాణ కాంగ్రెస్‌లో మొద‌టి నుంచి పీసీసీ వివాదం చెల‌రేగుతూనే ఉంది. ఉత్త‌మ్ రాజీనామా చేస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టి నుంచి నాకంటే నాకంటూ తెగ పోటీ రావ‌డంతో దీన్ని అప్ప‌ట్లో వాయిదా వేశారు. దాంతో కొంత‌కాలం సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ నేత‌లు.. ఇప్పుడు మ‌ళ్లీ తెర‌మీద‌కు పీసీసీ ప‌ద‌వి ఎంపిక రావ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. నేత‌లు మ‌ళ్లీ పోటీ ప‌డుతున్నారు.

ఇక ప్రస్తుతం నేడో రేపో అధ్యక్షుడిని ప్రకటిస్తారని వార్త‌లు వ‌స్తున్న టైమ్‌లో తెలంగాణ కాంగ్రెస్ లో స‌రికొత్త ట్విస్ట్ సంచ‌ల‌నంగా మారింది. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎవ‌రికి ఇవ్వాల‌న్న దానిపై ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తో పాటు జగ్గారెడ్డి అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిసి ఎమ్మెల్యే పొడెం వీరయ్య లెటర్ హెడ్ మీద లేఖను రాశారు సోనియాగాంధీకి.

పీసీసీ అధ్య‌క్షుడిని ఎంపిక చేసే ముందు అత‌డికి కాంగ్రెస్‌లో ఉన్న ట్రాక్ రికార్డ్ తోపాటు తాను పార్టీకి చేసిన కృషిని గుర్తించాల‌ని కోరారు. అలాగే గాంధీ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉండే వ్య‌క్తిని ఎంపిక చేయాల‌ని కోరారు. దీంతో ఈ లెట‌ర్‌కాస్తా రేవంత్‌కు వ్య‌తిరేకంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో సంత‌కం చేసిన ఈ ముగ్గురు రేవంత్‌కు మొద‌టి నుంచి వ్య‌త‌రేకంగానే మాట్లాడుతున్నారు. ఇదిరేవంత్ వ‌ర్గానికి మింగుడు ప‌డ‌ని అంశ‌మే.

Read more RELATED
Recommended to you

Latest news