ఉత్తరప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయంతో ఉపుమీదున్న బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీ నాయకత్వం లో 2024 లోక్ సభ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కమలం పార్టీ కి ఎన్నికల ప్రచారంలో సారథ్యం వహించిన మోడీ ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ ఏమన్నారు అంటే

దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రి మోడీ ఆకర్షణ తగ్గలేదు అని తాజా అసెంబ్లీ ఫలితాలు నిరూపించాయి అని, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రధానమంత్రి మోడీ కి నా కృతజ్ఞతలు అంటూ మీడియా ద్వారా తెలియజేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం దేశంలో విద్వేష పూరితమైన వాతావరణం ఉందని ఇలాంటి సమయంలో ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కష్టపడాలి అని సూచించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద సంపూర్ణ విశ్వవాసం ఉందని కూడా తెలిపారు.

థరూర్ ప్రస్తుతం జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ లో బిజీగా బిజీగా గడుపుతున్నారు.