రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలే సస్పెండ్ చేస్తారు : బక్క జడ్సన్

-

పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీ ‘లైన్ దాటి మాట్లాడుతోన్న నేతలపై టీ- కాంగ్రెస్ చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోన్న సీనియర్ నేత బక్క జడ్సన్ ను పార్టీ నుండి ఆరు ఏండ్లు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో బక్క జడ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు సస్పెండ్ చేస్తారు అని అన్నారు.సీఎం పదవిని గుంపు మేస్త్రి పని అంటాడు.. ఎమ్మెల్సీ కౌన్సిల్‌ను ఇరానీ కేఫ్ అంటాడు. రేవంత్ రెడ్డికి ఆ పదవుల విలువ తెలుసా? – కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ప్రశ్నించారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై పలుమార్లు బక్క జడ్సన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ డిసిప్లేనరీ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. షోకాజ్ నోటీసులకు బక్క జడ్సన్ ‘రిప్లై ఇచ్చినప్పటికీ.. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కమిటీ.. తాజాగా బక్క జడ్సన్ ను ఆరేండ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news