కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మాస్టర్ చెఫ్ అంటూ ఓవైపు పొగుడుతూనే మరో యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించింది. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలను గడ్కరీ ప్రశంసించడంతో ఆయన సేవలను గుర్తించిన గడ్కరీని మాస్టర్ చెఫ్‌గా అభివర్ణించింది.
కొద్దిరోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను తెరవలేదని విమర్శించారు. అవి సగం వండినట్లు అసంపూర్తిగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ హయాంలోనే.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
దీనిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ట్విటర్లో స్పందించింది. ‘సగం వండిన అనే పదంవాడి 1991 నాటి సంస్కరణలను నిర్మలా సీతారామన్ తక్కువచేసి మాట్లాడారు. కానీ మన్మోహన్ సింగ్ సేవలకు తగిన ప్రశంసలు అర్పించి..మాస్టర్ చెఫ్ నితిన్ గడ్కరీ వాటిని(సంస్కరణలు) బాగా వండారు. ఆమె ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను’అని వ్యాఖ్యలు చేసింది.