అలా పోరాడితేనే ఉగ్రవాదాన్ని అంతం చేయగలం : అమిత్ షా

-

దేశంలో తీవ్రవాదంపై, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడే  సంస్థల భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. గట్టిగా పోరాడితే తప్ప ఉగ్రవాదంపై గెలవలేమని చెప్పారు. దేశంలో అంతర్గత భద్రతపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులతో హోం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  ఉగ్రవాదం, సైబర్‌ భద్రత, సరిహద్దు అంశాలపై చర్చించారు.

వామపక్ష తీవ్రవాదాన్ని కట్టడి చేయాలంటే దాని ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలని అమిత్ షా సూచించారు.  ప్రతి ఓడరేవుపైనా స్పెషల్ పోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.  దేశంలో యువత డ్రగ్స్ కు బానిసగా మారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని.. డ్రగ్స్ ద్వారా ఆర్జించే డబ్బు దేశ అంతర్గత భద్రతను ప్రభావితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి ఒక్కరు పోరాడి డ్రగ్స్‌ను  పూర్తిగా నాశనం చేయాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి దేశంలో శాంతిని కొనసాగించడంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో అజ్ఞాతంలో ఉంటూ కీలక సహకారం అందిస్తోందని ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news