ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో పలుమార్లు సమావేశం అయ్యారు ప్రశాంత్ కిషోర్. సోనియా గాంధీ, రాహుల్ గాాంధీ, ఇతర ముఖ్య నేతలతో ప్రశాంత్ కిషోర్ సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే పీకే ప్రతిపాదనలపై పార్టీలోని ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఆమోదం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలను సోనియా గాంధీతో పాటు ముఖ్యనేతలకు వివరించారు. మే 7న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మూహూర్తం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. జనరల్ సెక్రటరీ హోదాతో పాటు కమ్యూనికేషన్, సోషల్ మీడియా విభాగాలను ప్రశాంత్ కిషోర్ కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బలపడేలా కార్యాచరణ రూపొందించనున్నారు పీకే. 2024 లో దాదాపు గా 13 కోట్ల మంది కొత్త ఓటర్లు రానున్నారు. వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించేలా పీకే కసరత్తు చేస్తోంది.