మామ మంచోడు అల్లుడు ఇంకా మంచోడు
కానీ అల్లుడి కన్నా మామ ముదురు
ఆ విధంగా పవర్ పోయినా మంత్రి పదవి పోయినా
మామ మాత్రం తగ్గడం లేదు
అల్లుడు ఆ హవాను చూసి బెదిరిపోతున్నారు
ఆ కథ బాలినేని శ్రీనివాస్ రెడ్డిది మరియు జగన్ ది.
అల్లుడు ఇలాకాలో మామ సైలెంట్ అయిపోయారు అని నిన్న మొన్నటి వరకూ చాలా మంది అనుకున్నారు. హాట్ సమ్మర్ లో హాట్ హాట్ పరిణామాలేవీ లేకుండానే గడిచిపోతుందని కూడా చాలా మంది అనుకున్నారు. అనుకుంటే అనుకున్నారు కానీ ఈ హాట్ సమ్మర్ లో చాలా పరిణామాలు జరిగి ఉన్నాయి. చాలా పరిణామాలు జగన్ కు భారంగా కూడా ఉన్నాయి. నెత్తినొప్పికి కారణం అయి ఉన్నాయి. తాజాగా సీఎం కాన్వాయ్ కోసం ఓ ప్రయాణికుడి (వినుకొండ ప్రాంతానికి చెందిన) నుంచి వెహికల్ తీసుకున్న ఘటనపై సీంఎ ఆఫీసు సీరియస్ అయింది. దీనిపై బాలినేని కూడా స్పందించి సంబంధిత బాధిత కుటుంబానికి క్షమాపణలు కూడా చెబుతానని అన్నారు. ఇక అసలు విషయానికే వస్తే.. ఒంగోలు పాలిటిక్స్ లో ఆదిమూలపు సురేశ్ దూసుకుపోతుంటే, మాజీ మంత్రి బాలినేని మాత్రం కాస్త తగ్గి ఉన్నారని నిన్నమొన్నటి వరకూ అంతా అనుకున్నారు. మీడియా కూడా ఆయన్ను అంతగా పట్టించుకోలేదు కూడా !
ఏవో కొన్ని అసంతృప్తతలూ, అసమ్మతి వాదాలూ ఆయనలో ఉన్నా కూడా జగన్ కు దగ్గరి బంధువు కావడంతో సైలెంట్ గానే తన పని తాను చేసుకుంటున్నారు అని అనుకున్నారు అంతా ! కానీ ఆయన చరిష్మాకు ఏం లోటు లేదని నిన్నటి వేళ ఆయన కాన్వాయ్ నిరూపించింది. మాజీ మంత్రి బాలినేనిని ప్రకాశం జిల్లాకు సంబంధించి రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది వైసీపీ సర్కారు. వీటితో పాటు నెల్లూరు, బాపట్ల జిల్లాల పరిణామాలను కూడా చూడనున్నారు. తాజా నియామకాన్ని అనుసరించి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు, నెల్లూరుకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలకు, బాపట్లకు సంబంధించి ఆరు నియోజకవర్గాలకు మొత్తం 22 నియోజకవర్గాలకు ఆయన కో ఆర్డినేటర్ గా ఉండనున్నారు.
ఈ సందర్భంగా ఆయన కోసం నిర్దేశించిన ర్యాలీ ఒకటి తీవ్ర చర్చకు తావిస్తోంది. అసలు లెక్కకు మించి వాహనాలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఉమ్మడి ప్రకాశం దారులు కిటకిటలాడాయి అన్న మాట కూడా వచ్చింది. బాపట్ల జిల్లా, పర్చూరు నియోజకవర్గం సరిహద్దు వద్ద చోటు చేసుకున్న పరిణామం వైసీపీ లో హాట్ టాపిక్ అయింది. సినీ ఫక్కీలో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ అనగా ఆయన రాక కోసం బారులు తీరాయి. పలువురు క్రియాశీలక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఎదురు వెళ్లి స్వాగతించిన వార్త ఒకటి హల్చల్ చేస్తోంది.ఈ నేపథ్యంలో తాజా పరిణామాలకు సీఎం జగన్ సైతం విస్తుబోతున్నారని సమాచారం. ఏదేమయినా మామ గ్రేట్. అవును ఆయన జగన్ కు వరసకు మామ. అల్లుడి కన్నా మామ గ్రేట్.