కేసీఆర్ తో తెగదెంపుల కోసమే ప్రశాంత్ కిషోర్ వచ్చారు.: జగ్గారెడ్డి

-

పీకే వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చకు దారి తీస్తోంది. కేసీఆర్ తో తెగదెంపులు చేసుకోవడానికే ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్ కు వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పీకే వ్యవహారం మాకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీని కలిసిన సమయంలో మీ పని మీరు చేసుకుంటూ వెల్లండని డైరెక్షన్ ఇచ్చారు. ప్రజల తరుపున టీఆర్ఎస్, బీజేపీ లను ఎండగట్టాలని నేతలకు సూచించారని జగ్గారెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీతో ఎలాంటి పొత్తులు కూడా ఉండవని అన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పీకే చర్చలు కాంగ్రెస్ కు సంబంధించిన వ్యవహారం కాదని జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య అక్రమ సంబంధం ఉందని జగ్గారెడ్డి విమర్శించారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ప్రతీ సందర్భంలో మోదీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ను వ్యతిరేఖిస్తుందని వెల్లడించారు. పీకే కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత…కేసీఆర్ తో సంబంధాాలు ఉన్నాయో లేవో తెలియజేస్తారని…అప్పటి వరకు వేచి చూడాల్సిందే అని జగ్గారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version