నిరుద్యోగులకు అలర్ట్‌.. కర్నూలు జిల్లా ఆసుపత్రుల్లో ఉద్యోగావకాశాలు

-

ఏపీలోని నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ శుభవార్త చెప్పింది. వివిధ ప్రభుత్వా ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ , ఏపీ వైద్య విధాన పరిషత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కింద వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మొత్తం 129 పారా మెడికల్ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఉమ్మడి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Use Only Hindi & English': Delhi Govt Hospital Bans Nurses from Talking in  Malayalam

అలాగే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, సంబంధిత పనిలో అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు ఆగస్టు 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా జనరల్‌ అభ్యర్ధులు రూ.250లు తప్పనిసరిగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.54,060ల వరకు జీతంగా చెల్లిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news