పుష్ప సినిమా రేంజ్‌లో మాస్టర్ ప్లాన్..వ్యాన్‌ పై కప్పు సెట్‌ చేసి మరీ !

-

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీ ఫక్కిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. పుష్ప సినిమా స్టైల్లో మాదక ద్రవ్యలను తరలుస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్గాలను మస్కా కొట్టి గంజాయి సరిహద్దులు దాటించేస్తున్నారు.

సినీ స్టైల్లో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ల ఐడియా. తాజాగా, ఆధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. బొలెరో టాప్ ప్రత్యేక ఆరను ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును, రట్టు చేసారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఈబీ పోలీసులు.

డుంబ్రిగూడ మండలం కించుమండలో దగ్గర గంజాయి ముఠా ను పట్టుకున్నారు ఎస్ఈబీ పోలీసులు. అనుమానస్పదంగా వెళుతున్న బొలెరోను ఆపి తనిఖీలు చేసారు. ఈ క్రమంలో వాహనంలో ఉన్న వారిని ప్రశ్నిస్తుండగా, ఎక్కడో చిన్న అనుమానం రావడంతో మళ్ళీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Latest news