రవితేజ నటించిన ధమాకా సినిమా వివాదంలోకి చిక్కుకుంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏంటీ నీ ఉప్పర సోది అంటూ దర్శకుడు త్రినాథరావు మాట్లాడారు. అయితే, దీనిపై ఉప్పర కులస్థులు సీరియస్ అయ్యారు. దర్శకుడు త్రినాథరావుకు వ్యతిరేకంగా ధర్నాలు చేశారు.
అయితే, ఈ వివాదంపై తాజాగా ఉప్పర సోదరులకు దర్శకుడు త్రినాథరావు క్షమాపణ చెప్పారు. తాజాగా ఉప్పర సోదరుల ఆందోళనపై స్పందించిన దర్శకుడు త్రినాథరావు.. నాపై కోపాన్ని సినిమాపై చూపించొద్దని కోరారు. నేను బీసీనే, ఉప్పర సోదరులు కూడా బీసీలో భాగమేనని.. సినిమా ప్రేక్షకుల్లో మీరూ భాగమేనని వివరించారు. ఉప్పర పదాన్ని బహిష్కరించాలని.. రాజకీయ నాయకులు, సినీ నటులు, ఇతరులెవరూ ఇకపై ఉప్పర పదం వాడొద్దని వెల్లడించారు దర్శకుడు త్రినాథరావు.