సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గడచిన పది రోజుల్లో ముగ్గురు టీచర్లు , తొమ్మిది మంది విద్యార్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

వారం రోజుల క్రితం అదే హైస్కూల్లో ఓ టీచర్ కు కోవిడ్ నిర్ధారణ అయింది. తాజాగా విద్యార్ధులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో విద్యా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాళ నేడు 36 మంది విద్యార్ధులకు కోవిడ్ టెస్టులు చేయించారు అధికారులు. ఈ నేపథ్యం లోనే నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో విద్యార్ధులు , టీచర్లు , పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలో పడ్డారు. ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 13 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడగా… 4 గురు టీచర్లకు కరోనా సోకింది.