చెక్ బుక్ వాడుతున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి..!

-

చాలా మంది చెక్ బుక్ ని వాడతారు. మీరు కూడా బ్యాంక్ చెక్ బుక్ ఉపయోగిస్తున్నారా? అయితే తప్పక మీరు ఈ విషయాలని తెలుసుకోవాలి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడే ఒక లుక్ వేసేయండి. చెక్ బుక్స్ ని వాడడం సాధారణమే. అయితే ఉపయోగించేటప్పుడు ఈ తప్పులు జరగకుండా చూసుకోవడం మంచిది.

banks
banks

మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో కచ్చితంగా చెక్‌కు సరిపడ డబ్బులు ఎప్పటికీ కలిగి ఉండాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి రావొచ్చు. కనుక ఒకసారి ఎవరికీ అయినా చెక్ ఇచ్చే ముందు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అవసరం అయితే. ఇది ఇలా ఉంటే దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఈ నెలలో కొత్త రూల్ తీసుకు వచ్చింది.

ఇక వాటి కోసం చూసేస్తే… మీ చెక్ క్లియరెన్స్ శనివారం, ఆదివారం కూడా జరగొచ్చు. అందువల్ల బ్యాంక్ సెలవులతో పని లేకుండా కచ్చితంగా ఎప్పటికీ డబ్బులు కలిగి ఉండాలి. అదే ఒకవేళ డబ్బులు లేవు అంటే చెక్ బౌన్స్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో మీర మళ్లీ ఫైన్ కట్టాల్సి రావొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆర్‌బీఐ ఈ నెల ప్రారంభం నుంచే ఎన్ఏసీహెచ్ సేవలును ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని బ్యాంకులకు ఈ రూల్స్ వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news