BREAKING NEWS: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ కు కరోనా పాజిటివ్.

-

పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నాయకులు కరోనా బారి పడుతున్నారు. పంజాబ్ మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధినేత కెప్టెన్ అమరిందర్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఐసోలేషన్ లో ఉన్నానని.. ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు. పంజాబ్ ఎన్నికలు మంచుకొస్తున్న వేళ అమరిందర్ కరోనా బారిన పడటం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో పాటు పొత్తు భాగస్వామి బీజేపీ కూడా దెబ్బే. కొన్ని రోజుల పాటు ప్రచారంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై కోవిడ్ బారిన పడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రలు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ కరోనా బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news