కరోనా దెబ్బ… ఈ రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

-

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల మీద కేంద్రం దృష్టి పెట్టింది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల కట్టడికి కేంద్ర బృందాలను పంపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి బృందాలను పంపింది. కరోనాను ఎదుర్కోవడం సహా వైద్య సహాయంలో కేంద్రం సహకరించే అవకాశం ఉంది. కేంద్రం గతంలో హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మణిపూర్ మరియు ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు ఉన్నత స్థాయి బృందాలను పంపింది.

ఈ రాష్ట్రాలలో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనావైరస్ కేసులు పెరిగినట్లు గుర్తించిన అన్ని జిల్లాలను ఉన్నత స్థాయి బృందాలు పరిసీలిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నియంత్రణ, నిఘా, పరీక్ష, వ్యాప్తి నివారణ మరియు నియంత్రణ చర్యలను బలోపేతం చేసే ప్రయత్నాలలో కేంద్ర బృందాలు ఈ రాష్ట్రాలకు సహాయం చేస్తాయి. ఒక్కో రాష్ట్రానికి ముగ్గురు సభ్యుల బృందం వెళ్ళే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news