చైనా నుంచి ఆగ్రాకు వచ్చిన వ్యక్తి కరోనా.. అధికారులు అప్రమత్తం

-

గత కొన్ని రోజుల నుంచి మళ్లీ కరోనా పేరు వినిపిస్తోంది. ఇటీవల కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా నమోదవడం.. రానురాను కరోనా కేసులు తగ్గుతుండటంతో కరోనా గురించి మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోయింది. అయితే.. చైనాలో మరోసారి కరోనా విజృంభన మరోసారి పెరగడంతో మళ్లీ కరోనా పేరు వినిపిస్తుంది. అయితే.. చైనా నుంచి ఆగ్రా చేరుకున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయనకు సోకింది ఎలాంటి వేరియంట్ అన్న విషయాన్ని తెలుసుకునేందుకు నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఈ మేరకు ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. చైనాలో పని చేస్తూ ఆగ్రాకు వచ్చిన ఆ వ్యక్తిలో లక్షణాలైతే కనిపించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని షాగంజ్‌లోని ఆయన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. నవంబరు 25 తర్వాత ఇక్కడ వెలుగు చూసిన కేసు ఇదొక్కటేనని, యాక్టివ్ కేసు కూడా ఇదొకటేనని పేర్కొన్నారు.

New variant of Corona detected in India - Telangana Today

చైనా నుంచి వచ్చిన ఆ వ్యక్తిని కలిసినవారు వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ ఏకే శ్రీవాస్తవ కోరారు. రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత ఆగ్రా రైల్వే స్టేషన్, బస్ స్టాపులు, విమానాశ్రయంలో టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఆగ్రాలోని చాలా వరకు హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి. తాజ్‌మహల్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అధికారులు టెస్టులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విదేశీ పర్యాటకులపై అధికారులు దృష్టిసారించారు. యూఎస్, చైనా, జపాన్, బ్రెజిల్, యూరోపియన్ దేశాల నుంచి తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్, అక్బర్ టోంబ్ సందర్శనకు వచ్చే పర్యాటకులకు అక్కడే కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news