Breaking : బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం..

-

కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో సైతం కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం ఓ విద్యార్థికి కోవిడ్ సోకగా అతడిని ఐసోలేషన్‌‌లో ఉంచారు. తాజాగా చేసిన మరికొందరు విద్యార్థులు ఆ లక్షణాలతో బాధపడుతుండగా పరీక్షలు చేశారు. వీరిలో ఆరుగురికి కోవిడ్ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో క్యాంపస్‌లోని మిగతా విద్యార్థులు ఆందోళణ చెందుతున్నారు. అయితే కోవిడ్ సోకిన విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచినందుకు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అధికారులు.

iiit basara admission 2022-23, Basara IIIT Admissions 2022: బాసర ట్రిపుల్‌  ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే - iiit basara  admission 2022 23 rgukt application for 6 year ...

క్యాంపస్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మెస్ కాంట్రాక్టర్‌ని మార్చాలంటూ శనివారం రాత్రి భోజనం మానేసిన విద్యార్థులు ఆదివారం రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. అధికారుల బుజ్జగింపులతో రాత్రి 11 గంటల సమయంలో ఆందోళన విరమించుకుని హాస్టల్ గదుల్లోకి వెళ్లిపోయారు. అయితే ఆందోళన చేసిన క్రమంలోనే విద్యార్థులు గుంపులు గుంపులుగా తిరగడంతో కరోనా కేసులు పెరిగే అవకాశముందన్న భయాందోళన నెలకొంది. విద్యార్థులెవరైనా కరోనా లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు అధికారులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news