జీరో కొవిడ్ విధానాన్ని ఉపసంహరించుకోవడం చైనా కొంప ముంచుతోంది. ఆ దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈనెల 11 నాటికి ఆ దేశవ్యాప్తంగా దాదాపు 90 కోట్ల మందికి కరోనా సోకినట్లు అక్కడి పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. 141 కోట్ల దేశ జనాభాలో ఇది దాదాపు 64 శాతం.
అత్యధికంగా ఇక్కడి గాన్సు ప్రావిన్స్‌లో 91 శాతం (23.9 కోట్లు) మంది ప్రజలు వైరస్ బారిన పడ్డారు. యునాన్(84 శాతం), కింఘై(80 శాతం) ప్రావిన్స్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరో 2-3 నెలల వరకు అక్కడ కొవిడ్ గరిష్ఠ స్థాయి ఉంటుందని అంటువ్యాధుల నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. అలాగే వైద్య సదుపాయాల కొరత ఉన్న, గ్రామీణ ప్రాంతాలకు ఇది వ్యాపిస్తుందని హెచ్చరించారు.