తెలంగాణలో 50 కి దిగువన కరోనా కేసులు.. జీరో మరణాలు

-

తెలంగాణలో కరోనా కేసులు దాదాపుగా తగ్గాయి. గతకొన్ని రోజుల నుంచి వందకు లోపే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో థర్డ్ వేవ్ ప్రభావం పూర్తిగా పోయింది. తెలంగాణలో కొత్తగా 50 కి దిగువనే కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కేవలం 35 కొత్త కరోనా కేసులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క మరణం కూడా లేదు. ప్రస్తుతం తెలంగాణలో 657 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. రికవరీ రేటు 99.39 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 91 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

తెలంగాణలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి కేసులను పరిశీలిస్తే… ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,90,791 గా ఉంది. 7,86,023 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 4111 మంది మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి దాదాపుగా అర్హులైన వారంతా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. దీంతో కరోనా సోకినా… త్వరగానే రికవరీ అవుతున్నారు. మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news