యూత్ కి పెరుగుతున్న కరోనా ముప్పు..కారణం ఇదే

-

దేశమంతటా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే కరోనా బారిన పడుతున్న వారిలో యువత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మేము యూత్.. రోగనిరోధక శక్తి ఎక్కువ.. కరోనా మమ్మల్ని ఏం చేయదులే అనుకుంటే కోరి ప్రమాదాన్ని కొన్ని తెచ్చుకున్నట్లే..కరోనాకి యువత మినహాయింపు ఏమి కాదు. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడుతున్న వారిలో యువతే అధిక సంఖ్యలో ఉన్నారు.

hypo thairaoidisam
చిన్నపిల్లలు, వృద్ధులతో పోలిస్తే యువతలో రోగ నిరోధక శక్తి ఎక్కువ. దీంతో కరోనా సోకినా తమకు ఏం కాదనే ధీమా కొందరిలో కనిపిస్తోంది. అవసరాల కోసం బయటకు వెళ్లడం వరకు ఓకేగానీ.. పని లేకున్నా కొందరు సరదాగా షికార్లు, పార్టీలు అంటూ బయట తిరిగి కరోనా బారిన పడుతున్నారు. కనీస జాగ్రత్తగా మాస్క్ కూడా ధరించటం లేదు. యువతలో కరోనా బారిన పడుతున్న వారిలో స్థూలకాయులకు, ఎర్లీ ఏజ్ డయాబెటిస్, రెస్పిరేటరీ కంప్లికేషన్స్, హైపోథరాయిడిజం ఉన్నవాళ్లకు ప్రాణహానీ ఉందంటున్నారు డాక్టర్లు.

పొగ తాగే అలవాటు, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్లు కూడా కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రమాదం పొంచి ఉండటంతో వాటిని తగ్గించాలని సూచిస్తున్నారు. మహారాష్ట్రలో 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 48 శాతం మంది కరోనా బారిన పడ్డారు. కర్ణాటకలో.. మార్చి 5 నుండి ఏప్రిల్ 5 మధ్య 47శాతం మంది.. 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్కులు పాజిటివ్‌గా తేలారు. ఇక ఢిల్లీలోనూ కోవిడ్-19 రోగులలో 65 శాతం మంది.. 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే. ఇక తెలంగాణలోనూ కరోనా బారిన పడుతున్న యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news