రెమిడిసివర్‌పై కస్టమ్స్ సుంకం రద్దు.. తక్కువ ధరలో వ్యాక్సిన్..!

-

దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి జరుగుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ రెమిడిసివర్, దాని తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలు, ఇతర వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండేలా రెమిడిసివర్ ఇంజెక్షన్ ధరను కూడా భారీగా తగ్గించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రెవెన్యూ శాఖ అధికారిక ప్రకటన చేసింది. దిగుమతి సుంకాన్ని తగ్గించే ఉత్పత్తుల్లో ఏపీఐలు, రెమిడిసివర్ వ్యాక్సిన్, వ్యాక్సిన్ తయారీలో వాడే బీటా సైక్లోడెక్ట్రిన్ ఉన్నాయి. ఈ దిగుమతి సుంకం మినహాయింపు ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుంది.

రెమిడిసివర్
రెమిడిసివర్

కోవిడ్ బాధితుల ఆరోగ్య సంరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెమిడిసివర్ ఏపీఐలు, ఇంజెక్షన్లు, ఇతర సామగ్రిలపై మినహాయింపు కల్పించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీని వల్ల వ్యాక్సిన్ సరఫరా పెరుగుతుందని.. ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు. కరోనా బాధితులకు ఈ వార్త కొంతమేర ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఏప్రిల్ 11వ తేదీన రెమిడిసివర్ వ్యాక్సిన్ డిమాండ్ పెరగడం, బ్లాక్‌లో వ్యాక్సిన్ అమ్మడంపై కేంద్రం ఇంజెక్షన్, ఏపీఐల ఎగుమతిని నిషేధించింది.

నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైస్ అథారిటీ (ఎన్‌పీపీఏ) మాట్లాడుతూ.. ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత వివిధ ఔషధ తయారీ కంపెనీలు రెమిడిసివర్ వ్యాక్సిన్ ధరలను తగ్గించాయని పేర్కొంది. కాడిలా హెల్త్‌కేర్ రెమ్‌డాక్ (రెమిడిసివర్ 100 ఎంజీ) ఇంజెక్షన్ ధరను రూ.2,800 నుంచి రూ.899కు తగ్గించింది. అలాగే సింజీన్ ఇంటర్నేషనల్ తన బ్రాండ్ రెమ్‌విన్ ధరను రూ.3,950 నుంచి రూ.2,450కు తగ్గించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆఫ్ హైదరాబాద్ రెడ్‌వైఎక్స్ ధరను రూ.5,400 నుంచి రూ.2,700కు తగ్గించింది. సిప్లా తన సిప్రేమి బ్రాండ్ ధరను రూ.4000 నుంచి రూ.3000కు తగ్గించింది. మెలన్ తన వ్యాక్సిన్ ధరను రూ.4,800 నుంచి రూ.3,400కు తగ్గించింది.

Read more RELATED
Recommended to you

Latest news