ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న కరోన టీకా విషయంలో రష్యా దాదాపుగా విజయం సాధించింది. కరోనా వ్యాక్సిన్ ని విడుదల చేసినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటన చేసారు. కరోనా తొలి వ్యాక్సిన్ తమదే అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. దీనిని గామలేయా అనే ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. రష్యా అధ్యక్షుడి కుమార్తె సహా పలువురిపై టీకాను ప్రయోగించారు.
దీనిపై ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అమెరికా, భారత్, బ్రిటన్, ఇటలీ, చైనా వంటి దేశాలు దీనిపై ప్రయోగాలు చేస్తున్నాయి. భారత్, అమెరికాలో ఇప్పటికే కరోనా హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వ్యాక్సిన్ రాకపోతే మాత్రం చాలా కష్టంగా పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కరోనా కేసులు రెండు కోట్లు దాటాయి.