బడ్జెట్ సమావేశాలకు ముందు భారీ కుదుపు…. పార్లమెంట్ సిబ్బంది 400 మందికి కరోనా పాజిటివ్

-

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కరోనా కేసులు కుదిపేస్తున్నాయి. పార్లమెంట్ సిబ్బంది వరసగా కోవిడ్ బారిన పడుతున్నారు. జనవరి 4 నుంచి పార్లమెంట్ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు.  మొత్తం 1409 మంది పార్లమెంట్ సిబ్బందిలో ఇప్పటి వరకు 402 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. రానున్న రోజుల్లో మరింత మంది వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. లోక్ సభకు చెందిన 200 మందికి, రాజ్య సభలో 69 మందికి, అనుబంధ సిబ్బంది 133 మందికి కరోనా సోకింది. మరోవైపు ఓమిక్రాన్ భయం వెంటాడుతుండటంతో.. వీరందరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఓ వేరియంట్ సోకిందో ఇందులో తెలియనుంది.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ తీవ్రం అవతున్నాయి. కొన్ని రోజుల క్రితం రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 10 లోపే ఉండేది. ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య లక్షను దాటాయి. దీంతో అన్ని ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. కరోనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news