టీఆర్‌ఎస్‌ ఎంపీకి కరోనా పాజిటివ్‌..

కరోనా వైరస్‌ చాలా మంది ప్రజా ప్రతినిధులను కలవరపెడుతుంది..ఇప్పటికే చాలామంది నాయకులకు కరోనా పాజిటివ్ వచ్చి కోలుకోగా..కొంత మంది ప్రముఖ నేతలను కరోనా బలితీసుకుంటుంది..తాజాగా మరో టీఆర్‌ఎస్‌ ఎంపీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది..

జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది..ఈ మేర‌కు ఆయ‌న అధికారికంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా ఉన్నాయ‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్‌-19 ప‌రీక్ష‌లు చేయించుకోవాలి అని ఎంపీ బీబీ పాటిల్ సూచించారు.