బ్రేకింగ్ : తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రికి కరోనా పాజిటివ్

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ..గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడం మూలంగా ఈ రోజు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గత రెండు, మూడు రోజులుగా ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని మంత్రి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,251 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఆరుగురు కరోనాతో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 565 మంది కరోనా బారిన పడి కోలుకున్నట్టు బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్.. తాజా కేసులతో పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,529కు చేరగా రికవరీ కేసులు 3,05,900కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో 1765 మంది ప్రాణాలు వదిలారు. యాక్టివ్ కేసులు 21,864గా ఉండగా.. అందులో హోం ఐసోలేషన్‌లోనే 14,431 మంది ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.