తెలంగాణ రాష్ట్రంలో రోజులకు కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే… అయితే అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నియంత్రణకు శరవేగంగా చర్యలు చెపడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ… ప్రజల్లో ధైర్యం నింపుతుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ప్రజల్లో కరోనా వైరస్ సోకితే భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి అని అపోహ ఉంది. తాజాగా దీనిపై స్పందించిన మంత్రి ఈటల రాజేందర్… పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రజల్లో ధైర్యం చెప్పారు.
కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే 100% కరోనా వైరస్ బారి నుంచి బయట పడే అవకాశం ఉంది అంటూ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా వైద్యం ఖరీదైనది కాదు అంటూ తెలిపిన ఈటల రాజేందర్… కరోనా వైద్యానికి కేవలం 10 వేల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది అంటూ స్పష్టం చేశారు. కరోనా సోకగానే కంగారు పడి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాలని సూచించారు.