కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఎంతగానో ఎదురు చూసే ప్రజానీకానికి సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా షాకింగ్ న్యూస్ చెప్పారు..ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాలు వివిధ దశల్లో పరీక్షల్లో ఉన్నాయని..రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.దేశంలో కరోనా వైరస్ తగ్గడంలేదని ఒకవేళ ఎవరైన తగ్గిపోయిందనుకుంటే పొరపాటేనన్నారు..ప్రజలు అపోహలు వీడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనన్నారు. వచ్చే ఏడాది వ్యాక్సిన్‌పై స్పష్టత రావొచ్చన్నారు. కోట్ల మందికి వ్యాక్సిన్ తీసుకురావటం కష్టమైన వ్యవహరమన్నారు. పరిశోధనలతో పాటు అదృష్టం కూడా కలసి రావాలని రాకేష్ మిశ్రా తెలిపారు. ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న టీకాలు మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, అయినప్పటికి అది అందరికి అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని అప్పటి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హెచ్చరించారు.