కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ ఇండియాలో పెరుగుతోంది. మొదటిలో చాలా వరకు కంట్రోల్ లో ఉందని భావించిన ప్రస్తుతం ఉన్న పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటిలో కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలో కనబడిన, తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు బాగా బయటపడ్డాయి. రెండు మూడు రోజుల్లోనే లెక్కలు మొత్తం తారుమారు అయ్యాయి. ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనలకు వెళ్లిన వారికి ఎక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ ఫలితాలు రావడంతో ఏపీలో ఒక్కసారిగా పాజిటివ్ ఫలితాలు సంఖ్య పెరిగింది.దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎవరెవరు వెళ్లారు అన్న దాని విషయంలో వివరాలు మొత్తం రాబట్టిన జగన్ సర్కార్…మత ప్రార్థనకు వెళ్ళిన వారిని వారి కుటుంబాలను క్వారంటైన్ కి తరలించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఎక్కడా కూడా వైరస్ సామాన్య ప్రజలలోకి వెళ్ళకుండా పగడ్బందీ చర్యలతో జగన్ సర్కార్ అధికారులను అప్రమత్తం చేస్తూ ఎక్కడికక్కడ ప్రజలను కట్టడి చేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసులు పెరిగినా గాని ట్రాక్ లో పడినట్లే అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ముందుగానే కేసులు గుర్తించడంతో పెరగటం మంచే జరుగుతుందని…ఈ విధంగా సామాన్య ప్రజల్లోకి వైరస్ వెళ్లకుండా కట్టడి చేసినట్లు అవుతుందని చాలామంది నిపుణులతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే తెలియజేస్తుందని చాలామంది అంటున్నారు.