దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటలలో 2,08,921 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 4147 మంది మృతి చెందారు డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 2,95,955 గా ఉంది. ఇక దేశంలో రికవరీ రేటు భారీగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,71,57,795 గా ఉండగా దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 24,95,591 గా ఉంది.
“కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,43,50,816 కాగా “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3,11,388 గా ఉంది. దేశంలో 89.26 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉంది. మొన్నటి వరకు 83 వరకు ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.60 శాతం మాత్రమే ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.14 శాతం గా ఉంది.