టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడొద్దని బండి సంజయ్ ని ఆదేశిస్తూ.. శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్నెట్, సోషలల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, బహిరంగ సభలు, ఇంటర్వ్యూలు, పత్రికా సమావేశాల్లో కేటీఆర్ పరువుకు భంగం కలిగించే విధంగా బండి సంజయ్ సహా ఇతరులు మాట్లాడరాదని.. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సెకండ్ అడిషనల్ చీఫ్ జడ్జి ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేశారు.
ట్విట్టర్ లో గత నెల 11న తనపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరాధాన ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ ఇటీవల పరువు నష్టం దావా వేశారు. అంతకంటే.. ముందు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసిన కేటీఆర్.. తనకు 48 గంటల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ క్షమాపణలు చెప్పకపోవడంతో.. కేటీఆర్ హైదరాబాదర్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే.. కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.