బిగ్ రిలీఫ్ : ఇకపై కరోనా​ కాలర్​ ట్యూన్లు బంద్ !

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రజలను ఓ ఆట ఆడుకుంటోంది. అయితే.. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలోనే.. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం.. టెలికాం ఆపరేటర్లు కాలర్‌ ట్యూన్లు ప్రవేశ పెట్టారు.

అయితే.. ఆ కాలర్‌ ట్యూన్లు, ఆడియో ప్రకటనలను త్వరలోనే ఆపేయనున్నారు. ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో… కరోనా ప్రీ కాల్‌ సందేశాలను నిలిపి వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ ప్రీ కాల్‌ – ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌ కాల్‌ మాట్లాడటం ఆలస్యమౌవుతోందని.. వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. భారత సెల్యూలర్‌ ఆపరేటర్ల సంఘం, మొబైల్‌ వినియోగదారుల నుంచి ఈ మేరకు విజ్ఞప్తులు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆడియో ప్రకటనలను త్వరలోనే ఆపేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news