కొవిడ్‌ కొత్త వేరియంట్.. మాస్క్‌ పెట్టుకోకపోతే మెదడుకే ప్రమాదం..

-

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ ఇప్పుడు అందర్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాను వణికిస్తున్న BA.7 అల్లకల్లోలం చేస్తుంది. ఆ భయాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో BA.7 గురించి చెప్పలేదు. BA.5 అనే మరో కొత్త వేరియంట్ గురించి చెప్పారు. అది మెదడుపై దాడి చేసేలా అభివృద్ధి చెందుతుందని పరిశోధకులు అంటున్నారు..

గతంలో వచ్చిన అధ్యయనాల ఫలితాలని సవాలు చేసే విధంగా ఈ కొత్త అధ్యయనం ఉందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మీద జరిపిన కొత్త పరిశోధనలో అది మానవ శరీరంపై ఎలా దాడి చేస్తుందో పరిశోధకులు పరిశీలించారు. శ్వాసకోశ వ్యవస్థకి సోకడం దగ్గర నుంచి మెదడుకు వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కి చెందిన పరిశోధకులు మునుపటి వైరస్ కంటే BA.5 వేరియంట్ ఎలుకల మెదడు మీద తీవ్రమైన నష్టం కలిగించినట్లు కనుగొన్నారు. మెదడు వాపు, బరువు తగ్గడం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా రావొచ్చని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది.

BA.1 తో పోలిస్తే BA.5 వేరియంట్ ఎలుకల్లో వేగంగా బరువు తగ్గడం, మెదడు ఇన్ఫెక్షన్, మరణం సంభవించే అవకాశం ఉందని కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. అయితే ఈ కొత్త అధ్యయనాన్ని మరొక బృందం దారుణంగా కొట్టి పడేసింది. ఇది మానవులకు వర్తించదని వాళ్లు అంటున్నారు. అన్ని ఎలుకలు కొత్త వేరియంట్ వల్ల వచ్చిన మెదడు ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయాయని ఆ బృందం తెలిపింది. కానీ ఇది అంటు వ్యాధుల వల్ల కూడా జరిగే అవకాశం ఉందని హాంకాంగ్ విశ్వవిద్యాలయం నిపుణులు అంటున్నారు. మునుపటి సబ్ వేరియంట్ కంటే ప్రస్తుత వేరియంట్ మానవ మెదడు మీద ఎటువంటి ప్రభావం చూపబోదని అంటున్నారు. దీంతో ఏ అధ్యయాన్ని నమ్మాలో తెలియక పరిశోధకలే జుట్టు పీక్కుంటున్నారు.

జపాన్, యూఎస్ శాస్త్రవేత్తల బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉండబోతుందని గత నెలలోనే హెచ్చరించిన సంగతి తెలిసింది. అనేక అధ్యయనాలు కూడా BA.5 వేరియంట్ ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించాయి. అలాగే కోవిడ్ 19 టీకాతో పాటు రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోగలదని నివేదించాయి. ఈ జాతి 100 కంటే ఎక్కువ దేశాలలో కనుగొనబడింది.

ఆ టీకాలు వేయించుకున్న వారికే ప్రమాదం ఎక్కువ..

ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్న వారికి ఒమిక్రాన్ వేరియంట్ BA.5 సోకుతున్నట్టు గుర్తించారు. ఈ వేరియంట్‌ను అడ్డుకోవడానికి ఆ టీకాల సామర్థ్యం ఏమాత్రం సరిపోవడం లేదని గతంలోనే ఒక అధ్యయనం చెప్పింది. అమెరికాలో అధికంగా ఫైజర్, మోడెర్నా వంటి టీకాలు వేయించుకున్నవారే అధికం. ఆఖరికి మూడు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా BA.5 సులువుగా సోకుతున్నట్టు గుర్తించారు. అన్ని వేరియంట్ల కన్నా ఈ వేరియంట్‌తో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంతకు ముందు వచ్చిన కోవిడ్‌తో లంగ్స్‌ మాత్రమే ఎఫెక్ట్‌ అయ్యాయి.. కానీ ఇప్పుడు వస్తున్న వేరియంట్స్‌ ఏకంగా మెదడును ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే కనక నిజం అయితే.. ప్రమాదం పొంచి ఉన్నట్లే.. మాస్క్‌ పెట్టుకోకపోతే.. మెదడు రిస్క్‌లో పడ్డట్లే.. !

Read more RELATED
Recommended to you

Exit mobile version