అయ్యప్ప భక్తులకు శుభవార్త..శ‌బ‌రిమ‌ల‌లో ఆంక్ష‌లు సడ‌లింపు

-

శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు వెళ్లే.. అయ్య‌ప్ప స్వామి భ‌క్తుల‌కు పిన‌ర‌యి విజ‌య‌న్ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. శ‌బ‌రిమ‌ల యాత్ర పై క‌రోనా ఆంక్ష‌ల‌ను మ‌రింత స‌డ‌లిస్తూ.. భ‌క్తులు రాత్రి పూట బ‌స చేసేందుకు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు కేర‌ళ సీఎం విజ‌య‌న్ తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. కేర‌ళ రాష్ట్రం లో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా.. త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో.. శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు సంబంధించిన ఆంక్ష‌లను మ‌రింత స‌డ‌లిస్తున్న‌ట్లు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ నేతృత్వ‌లోని కేర‌ళ స‌ర్కార్ ప్ర‌క‌ట‌న చేసింది.

తాజాగా స‌వ‌రించిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం.. అయ్య‌ప్ప భ‌క్తులు ఇప్పుడు స‌న్నిధానంలో రాత్రి పూట బ‌స చేసేందుకు అనుమతి ఇస్తారు. యాత్రికులు బ‌స చేసేందుకు 500 గ‌దులు ఏర్పాటు చేశారు. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని అధికారులు కోరారు. అలాగే.. పంబ నుంచి నీలిమ‌ల‌, అప్పాచిమేడు, మ‌ర‌కూటం వ‌ర‌కు ర‌హదారిని కూడా తెరుస్తారు. ఇక కేర‌ళ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్న‌యం తో అయ్య‌ప్ప భ‌క్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news