ఓమిక్రాన్ పై మహా సర్కార్ కీలక నిర్ణయం… 144 సెక్షన్ అమలు..

-

ఓమిక్రాన్ వేరియంట్ దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటికే దేశంలో 32 కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. ఇదిలా ఉంటే ఓమిక్రాన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. విదేశాల నుంచి వచ్చే వారిపై ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువగా నిఘా పెట్టారు. ఏయిర్ పోర్టుల్లోనే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించి.. కరోనా పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిస్తున్నారు.

మరోవైపు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న క్రమంలో మహా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసుల నేపథ్యంలో డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో ముంబైలో సెక్షన్ 144 CrPC విధించబడింది. వ్యక్తులు లేదా వాహనాల ర్యాలీలు,మోర్చాలు,ఊరేగింపులు మొదలైనవి నిషేధించబడ్డాయి. మహారాష్ట్రలో ఇప్పటికే 17 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే మహారాష్ట్రలో 7 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో  3 కేసులు ముంబైలో నమోదవ్వడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news