బట్టలు విప్పి నగ్నంగా తిరుగుతున్నారు : హుజురాబాద్ ఉప ఎన్నికపై సిపిఐ నారాయణ సంచలనం

-

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ నారాయణ ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఉపఎన్నికల ముఖ చిత్రం లో ప్రజాస్వామ్యాన్ని బట్టలిప్పి ఊరేగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎన్నికల రూల్స్ పాటిస్తున్నారా.. ? నైతిక విలువలు పాటిస్తున్నారా ? ప్రజాస్వామ్యం బట్టలు విప్పి నగ్నంగా ఊరేగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ నారాయణ. ఆ నగ్న దృశ్యాలు చూడలేక సీపీఐ పోటీ దూరంగా ఉంటుందన్నారు నారాయణ.
ఆరాచకం పోవాలంటే ప్రజాస్వామ్య శక్తులు బలపడాలని.. కేంద్రం ప్రభుత్వం అన్నీ అమ్మెస్తేందన్నారు.

జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేఖంగా జరిగే పోరాటం లో తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రత్యక్షంగా పాల్గోంటారా.. ? అంటూ నారాయణ సవాల్ విసిరారు. ఇరు రాష్ట్రాల సీఎంలకు ఆ చిత్తశుద్ది ఉందా.. ? అని ప్రశ్నించారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని.. వాళ్లే కొట్టి వాళ్లే కేసులు పెడుతున్నారన్నారు.

వైసీపీ నేతల బూతులే ఎక్కువని.. టిడిపీ ,వైసీపీ నేతల బూతులు లెక్కపెడుదామా… ? అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాలపై ఇండ్లపైన దాడుల సంస్కృతి కి స్వస్తి పలకాలన్నారు. జగన్ రాక్షస పాలనకు మేము ఎంత వ్యతిరేకమో.. 356 ఆర్టీకల్ ఉపయోగించడానికి తాము అంతే వ్యతిరేకమన్నారు సీపీఐ నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news