సీఎం జగన్ మన్ను తిన్న పాములా ఉన్నాడని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరదలతో రాష్ట్రం ఇబ్బంది పడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాల వల్ల జరుగుతుందని.. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ ప్రాజెక్టు అన్నప్పుడు కేంద్రం భాధ్యత తీసుకోలేదు..సీఎం జగన్ మన్ను తిన్న పాములా ఉన్నాడని పేర్కొన్నారు. కేంద్రాన్ని ఏ విషయంలో ప్రశ్నించటం లేదు..పోలవరం కాపర్ డ్యాం మీద మట్టి వేస్తే నిలబడుతుందా.. అని నిలదీశాడు.
ప్రధాని వరద బాధిత ప్రాంతాన్ని పరిశీలించాలని.. ఏపీలో జనం మందు తాగి చనిపోయినా జగన్ మాట్లాడటం లేదు..జగన్ బ్రాండ్లు తాగి జనం చనిపోతున్నారని ఆయన సిగ్గుపడాలి..సీఎం మధ్యపాన నిషేదం హామీ ఏమైంది..అని ప్రశ్నించారు. తొమ్మిది వేల కోట్ల రూపాయల మద్యం ఆదాయాన్ని 22 వేల కోట్లు పెంచారు.. మద్యం మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతీ పథకానికి జగనన్న పథకం అని పేర్లు పెట్టుకోవటానికి సిగ్గుండాలని నిప్పులు చెరిగారు.