బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా స్టార్ట్…

-

ఇటీవల ప్రభాస్ తెలుగులో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు బెల్లంకొండ హీరో శ్రీనివాస్. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు కనీసం పోస్టర్ లకు పెట్టిన డబ్బుకు కూడా సరిపోలేదని వార్తలు హల్ చల్ చేశాయి. శ్రీనివాస్ పరాజయాలు ఎదురైనా ఏమీ పట్టించుకోకుండా వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధం అయ్యాడు. ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు, ఈ రోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగగా, డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ ను కొట్టగా హిట్ కోట్లని శ్రీనివాస్ కు విషెస్ చెప్పాడు.

ఈ సినిమాను 14 రీల్స్ ఎంటెర్టైనేమేంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి ప్రణాళికలు చేస్తోంది. కాగా ఇందులో పూర్తి నటీనటులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news