లాడ్జిలో అమ్మాయిలతో వ్యభిచారం చేస్తున్న సంఘటన హైదరాబాద్ లో కలకలం.. రేపుతోంది. హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి ఎదురుగా శ్రీ వెంకటేశ్వర లాడ్జి ఉంది. దానిని కర్నాటి రామారావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అందులో యడ్డ సహదేవ్ అనే వ్యక్తి రిసెప్షనిస్ట్ గా చేస్తున్నాడు. యజమాని రామారావు సె*క్స్ వర్కర్లను నియమించుకొని రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.
పక్క సమాచారం అందుకున్న పోలీసులు వెంకటేశ్వర లాడ్జ్ లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను యజమాని రామారావు సహా రిసెప్షనిస్ట్ సహదేవ్ ను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా అలాంటి వ్యవహారాలు మరి ఎక్కడైనా జరుగుతున్నాయా అని పోలీసులు ఆరా తీయడమే కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు.